ఇండస్ ఆప్స్టోర్ పరిచయం
ఇండస్ ఆప్స్టోర్ అనేది భారతీయ వినియోగదారుల కోసం రూపొందించబడిన ఒక దేశీయ ఆప్స్టోర్ సంబంధిత ఆప్వినియోగం కోసం వినియోగదారు-అనుకూల డిజైన్, కంటెంట్ స్ట్రీమ్‌లతో కూడిన ఈ ఆప్స్టోర్ ఆప్ను కనుగొని, దాని వినియోగాన్ని సులభతరం చేసే రూపొందించబడింది. అనేక రకాల స్కాన్‌లు, సమీక్ష ప్రక్రియలతో పరీక్షించిన తర్వాతే ప్రతి ఆప్వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నందున ఇండస్ ఆప్స్టోర్‌ను పూర్తిగా సురక్షితమైన, భద్రతతో కూడిన స్టోర్ అని చెప్పవచ్చు.
ఇండస్ ఆప్స్టోర ్ అన్ని ఆండ్రాయిడ్ పరికరాలలో అందుబాటులో ఉందా?
ప్రస్తుతం, ఇండస్ ఆప్స్టోర్ పరిమిత పరికరాల్లో అందుబాటులో ఉంది. అయితే, మేము దీన్ని ప్రతిరోజూ విస్తరించేందుకు కృషి చేస్తున్నాము. మీరు ఇండస్ ఆప్స్టోర్‌కు మద్దతిచ్చే పరికరాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, దయచేసి [email protected]లో మాకు ఇమెయిల్ చేయండి. మేము మీకు తగిన సమాచారంతో సహాయం చేస్తాము.
ఈ ఇండస్ ఆప్స్టోర్‌ను ఉపయోగించడానికి నాకు ఫోన్పే రిజిస్టర్డ్ నంబర్ అవసరమా?
లేదు, ఇండస్ ఆప్స్టోర్‌ని ఉపయోగించడానికి ఫోన్పే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం లేదు. మీరు లాగిన్ పేజీలో ఏదైనా నంబర్‌ని ఎంటర్ చేసి, OTPతో ధృవీకరించవచ్చు. గమనిక: ఏదైనా క్యాష్‌బ్యాక్/రివార్డ్‌లను పొందడానికి, వినియోగదారు స్వీకరించడానికి ఫోన్పే ఆప్ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
ఇండస్ ఆప్స్టోర్ నుండి ఆప్‌లను డౌన్‌లోడ్ చేయడం సురక్షితమేనా?
అవును, ఇది పూర్తిగా సురక్షితమైనది. డౌన్‌లోడ్ కోసం యాక్సెస్ చేయడానికి ముందు, ఇండస్ ఆప్స్టోర్ లోని ప్రతి ఆప్జాగ్రత్తగా పరీక్షించబడుతుంది అలాగే ఏదైనా హానికరమైన కంటెంట్ లేదా సమాచారం ఉందా అని చెక్ చేయబడుతుంది.
నేను ఆప్ను కనుగొనలేకపోతే ఏమి చేయాలి?
దయచేసి మీరు ఆప్పేరును ఖచ్చితంగా టైప్ చేశారా అని నిర్ధారించుకోండి లేదా మీ శోధన కీవర్డ్‌లను తగిన విధంగా సర్దుబాటు చేయండి. అంతేకాక, డెవలపర్ ఇంకా మా స్టోర్‌కి ఆప్ను అప్‌లోడ్ చేసి ఉండకపోవచ్చు. అలా అయితే, వీలైనంత త్వరగా వారిని ఇందులోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము. అటువంటి సందర్భాలలో, ఆప్గురించి మాకు తెలియజేయడానికి మీరు [email protected]లో మమ్మల్ని సంప్రదించవచ్చు, తద్వారా మేము ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను వేగవంతం చేయగలము. ఆప్అందుబాటులోకి వచ్చి ఇన్‌స్టలేషన్‌కు సిద్ధంగా ఉన్న వెంటనే మేము మీకు తెలియజేస్తాము.
ఇండస్ ఆప్స్టోర్‌లో నా ఆప్ను ఎలా ప్రచురించాలి?
మీ ఆప్ను ప్రచురించడానికి, మీరు ఇండస్ ఆప్స్టోర్ డెవలపర్ ప్లాట్‌ఫారంలో రిజిస్టర్ చేసుకోవాలి. “లిస్ట్ మై ఆప్”పై క్లిక్ చేసి, కింద పేర్కొన్న వివరాలను పూరించి, ఆప్సమీక్ష కోసం సమర్పించండి: • ఆప్వివరాలు. • ఆప్మీటాడేటా. • భారతీయ భాషల జాబితా. • డెవలపర్ సమాచారం.డేటా భద్రత. • అప్‌లోడ్ అప్లికేషన్. మీ ఆప్ను జాబితా చేయడానికి దశలను తెలుసుకోవడానికి "ఇక్కడ" క్లిక్ చేయండి.
నేను స్టోర్ నుండి ఆప్ను డౌన్‌లోడ్ చేయలేకుంటే ఏమి చేయాలి
ఇది క్రింది కారణాలలో ఒకదాని వల్ల కావచ్చు, • ఇంటర్నెట్ కనెక్షన్ బలహీనంగా ఉండడం • పరికర నిల్వ తక్కువగా ఉండడం. • మీ పరికరం OS వెర్షన్ ఆప్కు మద్దతు ఇవ్వకపోవడం. • ఆప్మీ పరికరానికి అనుకూలంగా లేకపోవడం. దయచేసి పై వాటిని చెక్ చేసి, ఆప్ని మళ్లీ డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఇంకా ఏదైనా సహాయం కావాలంటే, దయచేసి [email protected]లో మమ్మల్ని సంప్రదించండి.
నేను ఇండస్ ఆప్స్టోర్‌లో సమస్యను ఎలా నివేదించాలి లేదా అభిప్రాయాన్ని ఎలా పంచుకోవాలి?
ఫీడ్‌బ్యాక్‌ను పంచుకోవడానికి లేదా సమీక్షను చేర్చడానికి, మీరు ఇండస్ ఆప్స్టోర్‌లో ఆప్సమీక్ష ఫీ చర్ని ఉపయోగించవచ్చు. అవసరమైతే మీరు సమీక్షను అనుచితమైనదిగా కూడా గుర్తించవచ్చు. ఆప్స్టోర్-సంబంధిత సమస్యల కోసం, దయచేసి మీ ఫీడ్‌బ్యాక్‌ను మాకు [email protected] ద్వారా ఇమెయిల్ చేయండి.
అందుబాటులో ఉన్న భాషల జాబితాలో నా భాష కనిపించడం లేదు.
ప్రస్తుతం ఆప్స్టోర్ ఇంగ్లీష్, 12 భారతీయ భాషలలో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇంకేవైనా భాషలను అదనంగా చేర్చితే, ఈ భాషా జాబితాలో కనిపిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న భాషలు కింద ఇవ్వబడ్డాయి: - హిందీ - మరాఠీ - గుజరాతీ - తెలుగు - తమిళం - పంజాబీ - మలయాళం - ఒడియా - కన్నడ - బెంగాలీ - అస్సామీ - ఉర్దూ.
ఫిర్యాదుల విధానం అంటే ఏమిటి?
L1, L2 స్థాయిలలో తమ సమస్య పరిష్కరించబడలేదని భావించినా, అలాగే 10 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు తమ సమస్యకు నమ్మకం కలిగించే రీతిలో పరిష్కారం జరగలేదని భావించినా, వినియోగదారులు ఫిర్యాదును లేవనెత్తవచ్చు.
నేను ఇండస్ యాప్‌స్టోర్ సహాయ విభాగాన్ని ఎలా సంప్రదించాలి?
మీరు డెవలపర్ అయితే, మాకు సమస్యను తెలిపేందుకు దయచేసి మీ డెవలపర్ పోర్టల్‌కి లాగిన్ అయి, స్క్రీన్ కింది భాగాన ఎడమ మూలలో ఉన్ న చాట్ చిహ్నాన్ని నొక్కండి. మీరు వినియోగదారు అయితే, దయచేసి మీ సమస్యను [email protected]కి నివేదించండి.